Akash Deep: సిడ్నీ టెస్టుకు ఆకాశ్ దీప్ దూరం..! 3 d ago
ఆస్ట్రేలియాతో 3వ తేదీ అనగా శుక్రవారం నుంచి అయిదో టెస్టు జరగనున్నది. అయితే ఆ తుది టెస్టుకు పేస్ బౌలర్ ఆకాశ్ దీప్ దూరం కానున్నాడు. గాయం వల్ల అయిదో టెస్టుకు ఆకాశ్ దీప్ అందుబాటులో ఉండడం లేదని కోచ్ గౌతం గంభీర్ తెలిపాడు. వెన్ను పట్టేయడం వల్ల అతన్ని తప్పిస్తున్నట్లు వెల్లడించారు. బ్రిస్బేన్, మెల్‌బోర్న్ టెస్టుల్లో ఆకాశ్ దీప్ మొత్తం అయిదు వికెట్లు తీసుకున్నాడు. సిడ్నీలో ఇవాళ జరిగిన ప్రీ మ్యాచ్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని తెలిపాడు. అయితే పిచ్‌ను పరిశీలించిన తర్వాత తుది జట్టును వెల్లడిస్తామని గంభీర్ తెలిపాడు.